ఒత్తిడితో గుండె వ్యాధులు... కంటికి కనిపించని ప్రమాదం ?
Sep 22 2022 | Medicover Hospitals | Hyderabadసీనియర్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ మాట్లాడుతూ దాదాపుగా మనందరికీ గుండెపోటు రావడానికి గల సాధారణ కారణాలు గురించి తెలుసు. మనం చేయించుకునే ఆరోగ్య పరీక్షలు మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్ధాయి తదితర అంశాలను ఖచ్చితంగా వెల్లడిస్తుంటాయి. దురదృష్టవశాత్తు, గుండెపోటుకు కారణమయ్యే ఒత్తిడిని మాత్రం మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాము. తమపై ఒత్తిడి అధికంగా ఉందని అటు రోగులు లేదా వారి కన్సల్టింగ్ డాక్టర్లు గుర్తించడమూ కష్టమే ! నిజానికి ఒత్తిడి. అతి పెద్ద హంతకి. తీవ్ర స్ధాయి హార్ట్ ఎటాక్ రావడానికి ఇది ఒక్కటీ మన పై ఉంటే చాలు.
దాదాపుగా మనందరికీ గుండెపోటు రావడానికి గల సాధారణ కారణాలు గురించి తెలుసు. మనం చేయించుకునే ఆరోగ్య పరీక్షలు మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్ధాయి తదితర అంశాలను ఖచ్చితంగా వెల్లడిస్తుంటాయి. దురదృష్టవశాత్తు, గుండెపోటుకు కారణమయ్యే ఒత్తిడిని మాత్రం మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాము. తమపై ఒత్తిడి అధికంగా ఉందని అటు రోగులు లేదా వారి కన్సల్టింగ్ డాక్టర్లు గుర్తించడమూ కష్టమే ! నిజానికి ఒత్తిడి. అతి పెద్ద హంతకి. తీవ్ర స్ధాయి హార్ట్ ఎటాక్ రావడానికి ఇది ఒక్కటీ మన పై ఉంటే చాలు.
కొవిడ్–19 తీవ్రంగా మానసిక ఆరోగ్య నాణ్యతను దెబ్బతీసింది. సాధారణంగా మన జీవితాలలో కనిపించే ఒత్తిడిని ఇది గణనీయంగా పెంచింది. తగినంతగా నిద్ర లేకపోవడం, అనారోగ్య కారణాల వల్ల సాధారణంగా ఒత్తిడి కనిపిస్తుంటుంది .కానీ, భావోద్వేగ కారణాలు, తమకు తగినంత డబ్బులేదనే బాధ, లేదంటే ప్రియమైన వారు మరణించడం కూడా ఒత్తిడికి కారణమవుతుంది. వీటికి తోడు రోజువారీ కార్యకలాపాలు కూడా ఒత్తిడి పెరిగేందుకు దోహదపడతాయి. అయితే, కొవిడ్ కాలంలో, సామాజికంగా దూరంగా ఉండాల్సి రావడం, వ్యాధి సోకుతుందేమోనన్న భయం, ప్రియమైన వారిని కోల్పోవడం, ఉద్యోగం కోల్పోవడం వంటికారణాలు మరింత ఒత్తిడిని ప్రజలపై కలిగించాయి.
ఈ ఒత్తిడికి మన శరీరం స్పందించే తీరు మనల్ని రక్షిస్తుంటుంది. కానీ, ఈ ఒత్తిడి నిరంతరం పెరుగుతుంటే మాత్రం అది ప్రమాదకరంగా పరిణమిస్తుంటుంది. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, దీర్ఘకాలంగా ఒత్తిడితో బాధపడే వారిలో అత్యధిక స్థాయిలో కార్టిసోల్ ఉంటుంది. దీనివల్ల బ్లడ్ కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్, బ్లడ్ షుగర్, రక్తపోటు పెరుగుతాయి. ఇవన్నీ కూడా గుండె వ్యాధులకు కారణాలు. ఈ ఒత్తిడి కారణంగా రక్తనాళాలల్లో కొవ్వుపేరుకుపోవడమూ పెరుగుతుంది. అదే రీతిలో, ఒత్తిడితో కూడిన కార్యక్రమాలలో విడుదలయ్యే కాటెకోలమైన్స్ వల్ల రక్తపోటు కూడా పెరుగుతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ రావొచ్చు.
స్వల్పమొత్తంలో ఒత్తిడి వల్ల కూడా గుండె కండరాలకు రక్త ప్రవాహం తగ్గవచ్చు. దీనివల్ల గుండెకు తగినంతగా ఆక్సిజన్ అందదు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల రక్తం చిక్కగా మారి స్ట్రోక్ , హార్ట్ ఎటాక్ కూడా రావొచ్చు.
వీటికి తోడు ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు స్ట్రోక్ లేదా మరేదైనా అనారోగ్యవంతమైన మార్గాన్ని ఒత్తిడిని అధిగమించడానికి వినియోగించవచ్చు.
ఒత్తిడికి కారణంగా సాధారణంగా కనినించే లక్షణాలు :
- ఒళ్లు నొప్పులు, నీరసం ఆవరించడం, నిద్ర లేమి, ఆందోళన, కోపం, డిప్రెషన్ కలగడం, అసహనం, మతిమరుపు కనబడతాయి.
- ఒత్తిడి పరిస్థితులలో ప్రజలు విభిన్నంగా స్పందించే అవకాశాలున్నాయి. కొంతమంది ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ందుకు సన్నద్ధమైనట్లుగా ఉంటారు. మరికొంత మంది అసలేమీ పట్టనట్లుగా ఉంటారు. అదృష్టవశాత్తు మీరు మీ శరీరంపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీనికి మొదటగా ఒత్తిడికి కారణమయ్యే అంశాలను గుర్తించాలి. ఇది కష్టమే అయినప్పటికీ, ఒత్తిడి పరిస్ధితులలో మానసక, శారీరక స్పందనలను నియంత్రించుకోవాలి.
- ఈ దిగువ అంశాలను అనుసరించడం ద్వారా ఒత్తిడిని అధిగమించడంతో పాటుగా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు
- తగినంతగా వ్యాయామం చేయాలి...
- వ్యాయామాల కారణంగా ఒత్తిడి వల్ల కలిగే ప్రమాదాలు కొంత మేరకు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం కోసం కనీసం 30 నుంచి 40 నిమిషాలు వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేయాలి. వ్యాయామాలతో కార్డియో వాస్క్యులర్ ఆరోగ్యం మెరుగపడటంతో పాటుగా బరువు నియంత్రణలో ఉంచుకోవడమూ సాధ్యమవుతుంది. కొలెస్ట్రాల్ స్ధాయి పెరిగేందుకు, రక్తపోటు తగ్గించుకునేందుకు సైతం తోడ్పడుతుంది. ఒత్తిడి కూడా వ్యాయామాల కారణంగా తగ్గుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే డిప్రెషన్ కూడా తగ్గుతుంది.
- బలమైన మద్దతు వ్యవస్థలను నిర్మించుకోవాలి
- అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, బలమైన మద్దతు వ్యవస్థలను సైతం నిర్మించుకోవాలి. అంటే, వివాహం చేసుకోవడం, మీరు నమ్మే వ్యక్తులతో మాట్లాడటం లేదంటే మత సమావేశాలు, మీకు నచ్చిన ఆర్గనైజేషన్ కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల వల్ల ఒత్తిడి అధిగమించవచ్చు.
- ఒకవేళ మీకు గుండె వ్యాధులు ఉంటే, అదే నెట్‌వర్క్ మీ హార్ట్ ఎటాక్ ప్రమాదాలు తగ్గించేందుకు సైతం తోడ్పడతాయి. సామాజిక మద్దతు లేకపోతే అనారోగ్యకరమైన ప్రవర్తనలూ పెరిగే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- స్థిరంగా ఆందోళన, డిప్రెషన్ ఉంటే చికిత్స తీసుకోవాలి
- ఒకవేళ గుండెవ్యాధులు ఉండి ఉంటే ఆందోళన మరియు డిప్రెషన్ కారణంగా మరణించే అవకాశాలు పెరుగుతాయి
- అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం సుదీర్ఘకాలం ఆందోళన లేదా భావోద్వేగ ఒత్తిడి ఉంటే అకస్మాత్తుగా గుండె ఆగి మరణం సంభవించే అవకాశం కూడా ఉంది. మీ ఆందోళన స్థాయి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, వాకింగ్ మెడిటేషన్ లేదా ఇతర పద్ధతులు అనుసరించవచ్చు.
- పని ఒత్తిడి తగ్గించుకోవాలి
- పని ఒత్తిడి ఓ సమస్యగా మారింది. మీకు బలమైన మద్దతు వ్యవస్థ లేకపోతే లేదంటే దీర్ఘకాలిక ఆందోళన ఉంటే ఇది మరింత పెరుగుతుంది. ప్రతి రోజూ కొంత సమయం పనికి దూరంగా ఉండండి. మీకు ఆనందం కలిగించే పనులు చేయండి. అది రీడింగ్, వాకింగ్ లేదంటే డీప్ బ్రీతింగ్ కూడా కావొచ్చు. ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఈఏపీ) వంటివి ఒత్తిడి, ఆందళన నిర్వహణలో తోడ్పడతాయి.
- కనెక్ట్ అయి ఉండండి
- సామాజికంగా కనెక్ట్ అయ్యే గ్రూప్‌లతో కలిసి ఉండటం ముఖ్యం. లాక్‌డౌన్స్, ప్రయాణ అవరోధాల కారణంగా ప్రియమైన వారిని కలుసుకోవడం కష్టమైనప్పటికీ ఇంటర్నెట్, గాడ్జెట్స్ వంటివి వారిని కలుసుకునేందుకు తోడ్పడ్డాయి.
- మీ జీవితంలో ఒత్తిడి వల్ల మీకు గుండె వ్యాఽధుల ప్రమాదం వచ్చే అవకాశాలున్నాయని మీరు భావిస్తే, మీ డాక్టర్‌తో ఓసారి మాట్లాడండి. వారు మీకు ఒత్తిడి తగ్గించేందుకు సహాయపడే కౌన్సిలింగ్ తరగతులు లేదా ఇతర ప్రోగ్రామ్‌లను సూచించవచ్చు.
Popular Posts
- Medicover Hospitals has done Liver Diseases Awareness program and Launched Liver Clinic. 24.08.2022
- A baby born at 24 weeks of gestation with a less chance of survival was saved 22.08.2022
- Mahabubnagar farmer recovers after complex brain surgery at Medicover Hospitals 24.06.2022
- Fetal Heart Rate Problem 02.06.2022
- Man with Severe Bullet Injuries from Yemen Saved at Medicover Hospitals 01.06.2022